Ap news: ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. ముఖ్యంగా ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో ఈ ప్రభావం కనిపించింది. ఈ రెండు మండలాల్లోని పలు గ్రామాల్లో భూమి సుమారు రెండు సెకన్ల పాటు కంపించింది. ప్రస్తుతం ఎలాంటి పెద్ద నష్టం, ప్రాణ నష్టం జరగలేదు.
భూకంపం తర్వాత స్థానికులు భయంతో బయటకు పరుగులు తీశారు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. భూకంప తీవ్రతను ఖచ్చితంగా నిర్ధారించేందుకు ప్రయత్నిస్తున్నారు. భూకంప ప్రభావం అధికంగా ఉండకపోయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.