Laila Movie:: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న సినిమా ‘లైలా’. బోల్డ్ అండ్ యూనిక్ సబ్జెక్ట్స్ తో ఈ సినిమాను రామ్ నారాయణ తెరకెక్కించారు. సాహు గారపాటి దీనిని నిర్మిస్తున్నారు. సినిమా ప్రారంభ సమయంలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించిన మేకర్స్… ఇప్పుడు కూడా అదే మాటకు కట్టుబడ్డారు. ముందు చెప్పినట్టుగానే 2025 ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే కానుకగా దీనిని విడుదల చేస్తున్నట్టు తెలిపారు.
ఇది కూడా చదవండి: Khammam District: ఖమ్మం జిల్లా రఘునాథపాలెం బీసీ గురుకులంలో దారుణ ఘటన
Laila Movie: ఈ సందర్భంగా ఈ మూవీ నుండి లైలా ఐ లుక్ ను రిలీజ్ చేశారు. ఇందులో విశ్వక్ సేన్ స్టైలిష్ అవతార్, స్పోర్టింగ్ ట్రెండీ ఎటైర్, సన్ గ్లాసెస్ తో ఆకట్టుకునేలా ఉన్నాడు. అయితే చొక్కాతో తన ముఖాన్ని దుచుకున్నాడు. న్యూ ఇయర్ రోజున లైలా ఫస్ట్ రోజ్ ను రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో విశ్వక్స్ సేన్ అమ్మాయి పాత్రను పోషించడం విశేషం. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. ఈ యేడాది విశ్వక్ సేన్ నటించిన మూడు చిత్రాలు విడుదలయ్యాయి.