Priyanka Gandhi: హ్యాండ్ బ్యాగ్ తో పార్లమెంట్ కి..వినూత్న రీతిలో నిరసన..

Priyanka Gandhi: కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ వాద్రా పార్లమెంట్‌ లో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పాలస్తీనా, బంగ్లాదేశ్ మైనారిటీ హక్కుల సమస్యలను ఆమె ప్రస్తావించడానికి ప్రత్యేకమైన బ్యాగ్‌లను వాడడం గమనార్హం.

బంగ్లాదేశ్ మైనారిటీల సమస్య:

ప్రియాంక గాంధీ ఇవాళ “Stand with minorities of Bangladesh” అనే నినాదంతో ఉన్న బ్యాగ్‌ను ప్రదర్శిస్తూ పార్లమెంట్‌లో హాజరయ్యారు. బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఆమె ఈ విధంగా నిరసన తెలియజేశారు. విపక్ష ఎంపీలు కూడా అదే అంశంపై ఆమెకు మద్దతుగా నిలబడ్డారు.

పాలస్తీనా సంఘీభావం:

ప్రియాంక గాంధీ పార్లమెంట్‌ కు పాలస్తీనా సానుభూతిని తెలియజేస్తూ వచ్చిన బ్యాగ్‌పై పుచ్చకాయ శాంతి చిహ్నాలు ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె ఇజ్రాయెల్‌ సైనిక చర్యలపై తీవ్రమైన విమర్శలు చేశారు. గాజా తీరంలో జరుగుతున్న హింసను జాతి హత్యగా అభివర్ణించారు. ఇది అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే

.

 

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Boxer Murdered: దారుణ హత్య.. ఇంటి ముందే బాక్సర్ ని నరికి చంపిన దుండగులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *