Turkey: నరకం చూసిన జనం.. 24 గంటలు ఎయిర్ పోర్ట్ లోనే..

Turkey: ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టులో 400 మందికి పైగా ఇండిగో ప్రయాణికులు ఎదుర్కొన్న సమస్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీశాయి. టర్కీ రాజధాని విమానాశ్రయంలో 24 గంటలు గడిపిన ఈ ప్రయాణికులు, తమ గమ్యాలకు చేరుకోలేక తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు. ముందుగా విమానం ఆలస్యం అవుతుందని ప్రకటించాక, రద్దు గురించి ప్రకటించకుండా ప్రయాణికులను నిరుత్సాహపరిచారు. ఈ సమయంలో, ప్రయాణికులకు ఎటువంటి వసతులు, భోజనాలు వంటి అవసరాలు అందించలేదు.

ప్రత్యేకంగా, అనుశ్రీ బన్సాలీ అనే మహిళా ప్రయాణికులు విమానం వాయిదా పడటంతో ఎయిర్ పోర్ట్ లో చాలా సేపు వేచి ఉన్నామని ఇందుకు తమకు జ్వరం వచ్చినట్లు పేర్కొన్నా, ఇండిగో ప్రతినిధులు సంప్రదించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరో ప్రయాణికుడు, రోహన్ రాజా, చల్లటి వాతావరణంలో ఇబ్బంది పడినట్లు తెలిపారు.

టర్కిష్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది మాత్రమే సమాచారాన్ని అందించగలిగారు. మొత్తం ఈ వ్యవహారంపై ఇండిగో సంస్థ క్షమాపణలు తెలిపింది. నిర్వహణ కారణాల వల్ల విమానం ఆలస్యంగా నడుస్తుందని స్పష్టం చేసింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  United States: అమెరికాలో దారుణం.. దుండ‌గుల కాల్పుల్లో మ‌రో తెలుగు విద్యార్థి మృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *