Mass Jatara: రవితేజ కెరీర్ లో 75వ చిత్రంగా ‘మాస్ జాతర’ తెరకెక్కుతోంది. భాను భోగవరపు దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ నార్వేలో జరుగుతోంది. ఇటీవల గాయంతో రెస్ట్ తీసుకున్న రవితేజ చేతికి సర్జరీ జరిగింది. పూర్తిగా కోలుకుని ఇప్పుడు ‘మాస్ జాతర’ షూట్ లో జాయిన్ అయ్యాడు. యూరప్ లోని నార్వేలో మంచులో ఈ చిత్రానికి సంబంధించిన సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. అక్కడ షూట్ కు సంబంధంచిన పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది యూనిట్. ఇప్పుడు అవి వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్. గతంలో రవితేజ, శ్రీలీల కలయికలో వచ్చిన ‘ధమాకా’ సంచలన విజయం సాధించటంతో ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ మూవీని నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇటీవల కాలంలో సరైన విజయం లేని రవితేజ ‘మాస్ జాతర’తో మళ్ళీ ‘ధమాకా’ హిట్ ని రిపీట్ చేస్తాడేమో చూడాలి.
