Tollywood: చూస్తుండగానే 2024 సంవత్సరం చివరి అంకానికి చేరుకున్నాం. ఈ ఏడాదిలో ఎన్నో మలుపులు. ప్రత్యేకించి మెగా ఫ్యామిలీకి ఈ ఏడాది మరపురానిది. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్ అవార్డ్ అందుకోవడంతో పాటు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకోవడం, అలాగే అక్కినేని అవార్డ్ ను అందుకోవడం వంటి తీయని జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో నూటికి నూరుశాతం విజయం సాధించి చరిత్ర సృష్టించటమే కాదు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
ఇది కూడా చదవండి: Mass Jatara: నార్వేలో ‘మాస్ జాతర’
Tollywood: నాగబాబు కూడా త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రివర్గంలో చేరబోతున్నారు. ఇక రామ్ చరణ్ ఇదే ఏడాది వేల్స్ యూనివర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నాడు. నీహారిక కూడా ‘కమిటీ కుర్రాళ్ళు’తో నిర్మాత తిరుగులేని సక్సెస్ అందుకుంది. ఒక్క వరుణ్ తేజ్ మాత్రం ‘ఆపరేషన్ వాలంటైన్, మట్కా’ చిత్రాలతో వచ్చినా విజయం సాధించలేక పోయాడు. అయితే మెగాహీరో నుంచి అల్లు హీరోగా టర్న్ అయిన అల్లు అర్జున్ ‘పుష్ప2’తో నాలుగు రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్ లో చేరి హిస్టరీ క్రియేట్ చేశాడు. సో ఈ ఏడాది మెగానామ సంవత్సరంగా చెప్పుకోవచ్చు. మరి వచ్చే 2025 కూడా ఇదే ఫీట్ ను మెగా ఫ్యామిలీ రిపీట్ చేస్తుందేమో చూద్దాం.