తిరుమల లడ్డూ వ్యవహారంలో సుప్రీం కోర్టు ఈరోజు తీర్పు ఇచ్చింది. సీబీఐ చీఫ్ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యుల బృందం ఈ అంశంపై దర్యాప్తు చేస్తుందని కోర్టు స్పష్టం చేసింది . ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై వైసీపీ నుంచి తొలి స్పందన వచ్చింది . వైసీపీ నాయకురాలు రోజా తీర్పును స్వాగతిస్తున్నామంటూ సోషల్ మీడియా Xలో పోస్ట్ చేశారు.
రోజా పోస్ట్ లో ఏమన్నారంటే..
శ్రీవారి లడ్డూ ప్రసాదాల వివాదంలో సుప్రీం కోర్టు తీర్పు ఆహ్వానించదగ్గ పరిణామం. సుప్రీం తీర్పుతో అయినా సున్నితమైన భక్తుల మనోభావాలతో కూడుకున్న శ్రీవారి ప్రసాదాల విషయంలో రాజకీయ దురుద్దేశపూరిత వ్యాఖ్యలు అందరూ మానుకుంటే మంచిది. మొదటి నుంచి మేము భావిస్తున్నది రాష్ట్ర ముఖ్యమంత్రే విచారణ, ఆధారాలతో సంబంధం లేకుండా రాజకీయ ఆరోపణలు చేసిన నేపథ్యంలో వారి పరిధిలోని విచారణతో నిజాలు బయటికి రావని స్వతంత్ర దర్యాప్తు సంస్థ కావాలని కోరుకున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా సిట్ సరిపోదని , కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో విచారణ జరగాలనే వాదనతో మా డిమాండ్‌కు విశ్వసనీయత పెరిగింది. సుప్రీం పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తుతో వాస్తవాలు బయటికి వస్తాయని , తద్వారా గాయపడిన కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని పునరుద్ధరించినట్టు అవుతుందని తిరుపతి ఆడబిడ్డగా నమ్ముతున్నాను..!! అంటూ రోజా ట్వీట్ చేశారు .
ఆ ట్వీట్ ఇక్కడ చూడొచ్చు..
శ్రీవారి లడ్డూ ప్రసాదాల వివాదంలో #SupremeCourt తీర్పు ఆహ్వానించదగ్గ పరిణామం. సుప్రీం తీర్పుతో అయినా సున్నితమైన భక్తుల మనోభావాలతో కూడుకున్న శ్రీవారి ప్రసాదాల విషయంలో రాజకీయ దురుద్దేశపూరిత వ్యాఖ్యలు అందరూ మానుకుంటే మంచిది. మొదటి నుంచి మేము భావిస్తున్నది రాష్ట్ర…
— Roja Selvamani (@RojaSelvamaniRK) October 4, 2024


