Nagarjuna vs Konda Surekha: కేటీఆర్ ను విమర్శించే క్రమంలో తన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై నటుడు అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేశారు . ఈ విషయంపై ఎంతవరకైనా పోరాడాలని నాగార్జున భావిస్తున్నారని వార్తలు వచ్చాయి . కాగా ఇప్పటికే సురేఖకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోటీసులు పంపించారు . ఇక మరోవైపు టాలీవుడ్ మొత్తం నాగార్జున వైపే నిలబడింది . మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు నాగ్ కు లేదా సమంతకు సంబంధించినవి కావనీ , అవి మొత్తం ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టాయని అంటున్నారు .
మరోవైపు సమంతపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలివైనప్పటికీ నాగార్జున మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు . అన్నట్టుగానే కొండా సురేఖపై న్యాయపోరాటానికి రెడీ అయిపోయారు . ఆమె ఎన్నిరకాలుగా తానన్న మాటల విషయంలో పొరపాటు జరిగింది అని చెప్పినా . . దానిని నాగార్జున పరిగణనలోకి తీసుకోలేదు . నాంపల్లి కోర్టులో కొండా సురేఖపై క్రిమినల్ , పరువు నష్టం దావాలు వేశారు నాగార్జున . తమ కుటుంబ సభ్యుల గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా కొండా సురేఖ వ్యాఖ్యలు చేసిందంటూ నాగార్జున ఈ దావా వేశారు .
కేటీఆర్ పై ఆరోపణలు చేసే క్రమంలో సమంత, అక్కినేని కుటుంబాలపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. సినీ ఇండస్ట్రీ మొత్తం ఏకమవడంతోపాటు ప్రజలు, రాజకీయ పక్షాలు ఆమె తీరును ఖండించాయి. ఇప్పటికే ‘హైడ్రా’తో GHMC పరిధిలో పేదల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి సురేఖ వ్యాఖ్యలు మరింత డ్యామేజ్ కలిగించాయి. ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.
నటి సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాని సహా పలువురు నటీనటులు కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.



