Narendra Modi: ఈశాన్య రాష్ట్రాల సాంస్కృతిక వైవిధ్యాన్ని పరిచయం చేసేందుకు అష్టలక్ష్మీ ఉత్సవ్‌ను ఢిల్లీలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సమయంలో ఈశాన్య రాష్ట్రమైన మిజోరాంకు చెందిన ఓ చిన్నారి ప్రధాని మోదీతో పాటు ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రుల సమక్షంలో ‘వందేమాతరం’ ఆలపించిన అందమైన వీడియో వైరల్‌గా మారింది.
ఇది కూడా చదవండి: West Bengal:మైనర్ పై అత్యాచారం.. రెండు నెలల్లో సంచలనం తీర్పు
Narendra Modi: ఇంతకుముందు, మిజోరాం మాజీ ముఖ్యమంత్రి అదే అమ్మాయి ఏఆర్ రెహమాన్ ‘వందేమాతరం’ పాట పాడుతున్న వీడియోను పంచుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆ వీడియోను షేర్ చేశారు. ఆ చిన్నారి పేరు ఎస్తేర్ హ్న్మేట్. ఆమె స్వస్థలం మిజోరాం. ఆ బాలిక మోదీ సమక్షంలో వందేమాతరం ఆలపించి హృదయాలను అక్కడి అందరి హృదయాలను కొల్లగొట్టింది.

