Life Stories Movie

LIfe Stories Movie: చిన్న సినిమాగా వచ్చి.. రెండువారాలుగా థియేటర్లలో సందడి చేస్తున్న లైఫ్ స్టోరీస్!

LIfe Stories Movie ఉజ్వల్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన మెమరబుల్ సినిమా లైఫ్ స్టోరీస్. ప్రేమ, కోరిక అలాగే ఇతర మానవ సంబంధాల మధ్య ఉండే సున్నితత్వాన్ని స్పృశిస్తూ తీసిన సినిమా. పెద్దగా మార్కెటింగ్ చేయకపోయినా.. చిన్న సినిమా అయినా ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ రాబట్టుకుంది. వీకెండ్ లో థియేటర్లలో రిపీట్ వాల్యూతో లైఫ్ స్టోరీస్ విజయవంతంగా నడుస్తోంది. 

LIfe Stories Movie భారీ ప్రమోషనల్ బడ్జెట్ లేకపోయినా.. పెద్ద తారాగణం లేకపోయినా కథ, కథనంతో లైఫ్ స్టోరీస్ సినిమా అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ఇప్పటికే అనేక ప్రతిష్టాత్మక చలనచిత్రోత్సవాలలో నామినేషన్లు పొందింది.  కొన్ని అవార్డులను గెలుచుకుంది. బెల్జియంతో సహా అంతర్జాతీయంగా స్క్రీనింగ్‌లను నిర్వహించే అవకాశంతో పాటు  బిట్స్ హైదరాబాద్‌లో కూడా దీనిని ప్రదర్సించే అవకాశం లభించింది. ఈ సినిమా మంచి కథ, కథనం ఉన్న సినిమాలకు ఇంకా ఆదరణ తగ్గలేదని. సినిమా బావుంటే మన ప్రేక్షకులు మెచ్చుకుని తీరుతారని రుజువు చేసింది. 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *