MLC Kavitha:

MLC Kavitha: పొలిటికల్‌‎గా ఎమ్మెల్సీ కవిత రీ ఎంట్రీ

MLC Kavitha: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి… తెలంగాణ జాగృతి పేరుతో ప్రజలకు చేరువయ్యారు కల్వకుంట్ల కవిత… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను గల్లి స్థాయి నుంచి దేశ విదేశాల వరకు తీసుకెళ్లడంలో కవిత కీలకపాత్ర పోషించారు. బతుకమ్మ వేడుకలు అంటే కవిత… కవిత అంటే బతుకమ్మ వేడుకలు అనే విధంగా ఆమె పేరు తెచ్చుకున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం తన వంతుగా పోరాటం చేశారు. అయితే అనూహ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితపై సీబీఐ, ఈడి రైడ్స్ జరిగాయి. పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయని ఈ వ్యవహారంలో కవిత కీలక పాత్రధారి అంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆమెను అరెస్ట్ చేసి తీహార్ జైలుకు తరలించారు.

కవిత అరెస్టు వ్యవహారం బీఆర్ఎస్‌తో పాటు కేసీఆర్ వెనకడుగు వేసేలా చేసింది. కొన్ని నెలల పాటు సాగిన విచారణలో సీబీఐ సరైన సాక్షాధారాలు చూపెట్టకపోవడంతో బెయిల్‌పై విడుదలై బయటికి వచ్చారు. జైలు నుంచి వచ్చాక అనారోగ్య కారణాలతో ఇంటికే పరిమితమయ్యారు. దాదాపు మూడు నెలల పాటు రాజకీయాలకు దూరంగా ఆమె సైలెంట్‌గా ఉన్నారు. అదాని వ్యవహారంలో సంచలన ట్వీట్ చేస్తూ కల్వకుంట్ల కవిత పొలిటికల్ రీ ఎంట్రీ ఇచ్చారు. అఖండ భారత దేశంలో ఆడబిడ్డకో న్యాయం… అదానికి ఒక న్యాయమా అంటూ.. మోదీని ప్రశ్నించారు. ఆధారాలు లేకున్నా ఆడబిడ్డనీ ఈజీగా అరెస్టు చేస్తారు.

ఇది కూడా చదవండి: 

MLC Kavitha: నిజామాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీగా కవిత ఉన్నారు. అయినప్పటికి గత రెండేళ్లుగా ఉమ్మడి జిల్లాలో అధికార కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గత లోకసభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక కొద్ది రోజులకే ఎమ్మెల్సీ అయ్యారు. అయినప్పటికి జిల్లా పార్టీ పాలనా వ్యవహారాల్లో అంటీముట్టనట్టుగా ఉంటూవచ్చారు. 

కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో బోధన్, అర్బన్ సెగ్మెంట్లకు ఇన్చార్జిగా పనిచేశారు. కానీ ఫలితం దక్కలేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో ఢిల్లీ లిక్కర్ కేసు తెరమీదికి తెచ్చారు. ఈడీ కవితను అరెస్టు చేసి జైలుకు పంపింది. దాదాపు అయిదు నెలల తర్వాత జైలు నుంచి బెయిల్ మీద బయటికి వచ్చారు.  కవిత రాబోయే రోజుల్లో రాజకీయాల్లో మరింత క్రియాశీలకం కావడానికి పావులు కదపడం హాట్ టాపిక్ అయింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *