కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల వాడి సన్నిధిలో కొండచిలువ కలకలం రేపింది. సెప్టెంబర్ 29 నడు మ్యూజియం సమీపంలోని శృంగేరి మఠం వద్ద అకస్మాత్తుగా ప్రత్యక్షమైంది. 10 అడుగులకుపైనే ఉన్న పామును చూసి జనం భయబ్రాంతులకు గురయ్యారు.
వాహనదారులు రాకపోకలు సాగిస్తున్న సమయంలో రోడ్డుపై వెళ్తున్న కొండచిలువను చూశారు. వెంటనే టీటీడీ అధికారులకు అటవీశాఖకు సమాచారం అందించారు. అటవీ అధికారులు స్నేక్ క్యాచర్ ను ఘటనా స్థలానికి పంపారు. కొండ చిలువను పట్టుకున్న స్నేక్ క్యాచర్ తిరుమల మొదటి ఘాట్ రోడ్‌లో వదిలేశారు.