Elon Musk:

Elon Musk: ప్ర‌పంచంలో అత్యంత‌ ధ‌న‌వంతుడు మ‌ళ్లీ ఆయ‌నే..

Elon Musk: టెస్లా, ఎక్స్ (ట్విట్ట‌ర్‌) సీఈవో ఎల‌న్ మ‌స్క్ ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌న‌వంతుడిగా అవ‌త‌రించారు. టెస్లా కార్ల షేర్ల విలువ పెర‌గ‌డంతోపాటు ఇటీవ‌ల అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో డొనాల్డ్ ట్రంప్ విజ‌యంతో ఆయ‌న సంప‌ద విలువ 40 శాతం వృద్ధిని సాధించింది. దీంతో ప్ర‌స్తుతం ఆయ‌న ఆస్తుల విలువ 347 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరింది. కంపెనీ స్టాక్స్ నిన్న 3.8 శాతం లాభంతో 352.56 డాల‌ర్ల వ‌ద్ద ముగిసింది. గ‌త మూడేండ్ల‌లో ఇంత‌స్థాయికి పెర‌గ‌డం ఇదే తొలిసారి కావ‌డం విశేషం.

Elon Musk: స్టాక్స్ పెరుగుద‌ల నేప‌థ్యంలోనే మ‌స్క్ సంప‌ద 347 బిలియ‌న్ డాల‌ర్ల పెరుగుద‌ల న‌మోదైంది. నూత‌న అధ్య‌క్షుడు కానున్న డొనాల్డ్ ట్రంప్.. మ‌స్క్‌కు అత్యంత స‌న్నిహితుడు కావ‌డం గ‌మ‌నార్హం. ఇక ట్రంప్ అధ్య‌క్షుడు అయ్యాక తీసుకోనున్న నిర్ణ‌యాల‌తో మ‌స్క్ సంప‌ద మ‌రింత పెరిగే అవ‌కాశం ఉన్న‌ద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. మ‌స్క్ సూచ‌న‌లు పాటిస్తార‌ని, ఆయ‌న వ్యాపారానికి మ‌రింత‌గా వెలుసుబాటు ల‌భిస్తుంద‌ని పేర్కొంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే మ‌స్క్ భ‌విష్య‌త్తు ప్రాజెక్టుల‌ను కూడా ప‌ట్టాలెక్కిస్తార‌ని చెప్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *