Hyderabad: ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య కనుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న అబ్బయ్య హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.ప్రస్తుతం ఆయన వయసు 70 ఏళ్లు. ఊకే అబ్బయ్య సీపీఐ నుంచి ఒకసారి టీడీపీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అబ్బయ్య టిడిపిలో క్రియాశీలక రాజకీయాలు వ్యవహరించారు.
ఉమ్మడి ఏపీలో బూర్గంపాడు నుంచి 1983లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994, 2009లో ఇల్లందు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపాన్ని ప్రకటించారు. అబ్బయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియ జేశారు.