Kerala: శబరిమలకు అయ్యప్ప స్వామి దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. వేలాది మంది భక్తులు రావడంతో శబరిగిరులు అయ్యప్ప నామస్మరణతో మారుమ్రో గిపోతున్నాయి. ఈ క్రమంలోనే అయ్యప్ప స్వామి దర్శనానికి దాదాపు 10 గంటల సమయం పడుతుంది.
సన్నిధానం నుంచి పంబ వరకూ అయ్యప్ప భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. మండల పూజలు ప్రారంభం కావడంతో శబరిమలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుండటంతో అందుకు తగినట్లుగా ఏర్పాట్లను ఆలయ కమిటీ ట్రావెన్ కోర్ చేస్తుంది.
మరోవైపు శబరిమలై భక్తుల సౌకర్యార్థం చెన్నై నుంచి కొచ్చికి రోజుకు ఎనిమిది విమానాలు నడుపుతున్నట్టు విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు. చెన్నై నుంచి నడిచే ఎనిమిది విమానాలతో పాటు బెంగళూరు నుంచి చెన్నైకి వచ్చే మూడు విమానాలు కొచ్చి వరకు పొడిగించారు.జనవరి 25వ తేదీ వరకు ఇది అమల్లో ఉంటుంది. అలాగే ఎయిరిండియా ఎక్స్ప్రెస్, ఇండిగో, స్పైస్ జెట్ సంస్థలు చెన్నై నుంచి కొచ్చికి విమాన సేవలందిస్తాయి.