Meenakshi Chaudhary: సుశాంత్ సరసన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాలో నటించింది మీనాక్షి చౌదరి. ఆమెకు హీరోయిన్ గా ఇదే మొదటి సినిమా. ఆ తర్వాత తెలుగులో వరుసగా మూవీస్ చేస్తూ ఇవాళ తమిళంలోనూ పలు అవకాశాలను అందుకుంటోంది. ఇటీవల వచ్చిన ‘లక్కీ భాస్కర్’ మూవీ మీనాక్షి చౌదరికి నటిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. అలానే ‘మెకానిక్ రాకీ’ మూవీ ఇదే నెలలో విడుదల కాబోతోంది. ఇదిలా ఉంటే… ఆమె తొలి చిత్ర కథానాయకుడు సుశాంత్ ను ప్రేమిస్తోందని, వీరిద్దరి వివాహం త్వరలోనే జరుగుతుందనే వార్త కొంతకాలంగా మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే దీనిపై మీనాక్షి క్లారిటీ ఇచ్చింది. నటిగా ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న తనకు వెంటనే పెళ్ళి చేసుకునే ఆలోచన లేదని, ప్రస్తుతానికి తాను సింగిల్ అని… ఏ హీరోతోనూ ప్రేమాయణం నడపడం లేదని తెలిపింది.
 
							
