Hyderabad: హైదరాబాద్ గచ్చిబౌలి లోని సిద్దిక్ నగర్ లో 5 అంతస్తుల భవనం ఓవైపునకు ఒరిగింది. నిన్న రాత్రి 8:10 నిమిషాలకు పెద్ద శబ్దంతో 60 గజాల స్థలంలో ఒరిగింది. సరైన నిర్మాణ ప్రమాణాలు పాటించకుండా ఇంటి నిర్మాణ కోసం పక్కకే 150 గజాల స్థలంలో పిల్లర్ పూట్టింగ్ కోసం పెద్ద గుంత తవ్వడంతో ఈ భవనం వంగినట్లు చెబుతున్నారు. కూల్చివేసేందుకు సిద్ధమైన భవనం 60 గజాల స్థలం ఉంది.జిహెచ్ఎంసి, డి ఆర్ఎఫ్ ట్రాఫిక్, విద్యుత్, అంబులెన్స్ & లా అండ్ ఆర్డర్ పోలీసులు ఘటనా స్థలంలో పరిస్థితులను పర్యవేక్షిస్తూ.. అప్రమత్తంగా ఉన్నారు. హైడ్రాలిక్ యంత్రంతో మరికొద్ది సేపట్లో కూల్చి వేసేందుకు సిద్ధమవుతున్నారు హైడ్రా అధికారులు. కుంగిన భవనం చుట్టు పక్కల ఉన్న ఇళ్ళల్లోని నివాసితులను ఖాళీ చేయించారు అధికారులు.
