Pro Kabaddi League: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-11లో తెలుగు టైటాన్స్ అద్భుత విజయాన్ని సాధించింది. టేబుల్ టాపర్ హర్యాన స్టీలర్స్ జట్టు పై టైటాన్స్ 49-27తో కంగుతినిపించింది. ఆశిష్ నర్వాల్ 11 పాయింట్లు, విజయ్ మలిక్ 8 పాయింట్లతో విజృంభించి గెలుపులో కీరోల్ ప్లే చేశారు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన టైటాన్స్.. విరామ సమయానికి 24-11తో పూర్తి ఆధిక్యంలో నిలిచింది. బ్రేక్ తర్వాత కూడా ఇదే జోరు ప్రదర్శించిన టైటాన్స్ సునాయాస విజయం నమోదు చేసింది. కాగా పది మ్యాచ్ లాడిన తెలుగు టైటాన్స్‌కు ఇది ఆరో విజయం. మరో మ్యాచ్‌లో యు ముంబా 38-37తో బెంగళూరు బుల్స్‌ను ఓడించింది.

