Manipur: మణిపూర్ లో మళ్లీ చెలరేగిన అల్లర్లు.. పలు జిల్లాల్లో కర్ఫ్యూ

Manipur: మణిపూర్ లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనల్లో ఒకరు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. ఆందోళన కారులను చెదరగొట్టే క్రమంలో జిరిబామ్ జిల్లాలో భద్రతాదళాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 20యేళ్ల అతౌబా మృతిచెందాడు. దీంతో అక్కడ అగ్గిరాజేసుకుంది. మరోవైపు బాబుపరా ప్రాంతంలో శాంతి భద్రతలకోసం భద్రతా దళాలు మోహరించడంతో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మణిపూర్లో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉన్నతాధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అల్లర్లకు కారణాలతో పాటు అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, కేంద్ర హోంశాఖ సెక్రటరీ గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ డేకాతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ మీటింగ్లో పాల్గొన్నారు. మైతీ వర్గీయుల అల్టిమేటం నేపథ్యంలో.. మహారాష్ట్ర ఎన్నికల ర్యాలీలను రద్దు చేసుకుని హుటాహుటిన ఆదివారమే అమిత్ షా ఢిల్లీ చేరుకుని రివ్యూ చేపట్టారు.

సోమవారం కూడా అత్యవసర సమావేశం నిర్వహించారు. పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు కొన్ని సూచనలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేల ఇండ్లకు రక్షణ కల్పించాలని ఆదేశించారు. అల్లర్లు వ్యాపించకుండా అవసరమైతే మరికొన్ని జిల్లాల్లోనూ కర్ఫ్యూ అమలు చేయాలని, ఇంటర్నెట్ సేవలను కొన్ని రోజుల పాటు షట్డౌన్ చేయాలని సూచించినట్లు తెలిసింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *