Kashmir Ki Kali: అంతకు ముందు షమ్మీ కపూర్ తో ‘చీనా టౌన్’ వంటి సూపర్ హిట్ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ శక్తి సామంత తరువాత రూపొందించిన చిత్రం ‘కశ్మీర్ కీ కలీ’. 1964 నవంబర్ 20న ఈ చిత్రం విడుదలయింది. ఇందులో షమ్మీకపూర్ జోడీగా షర్మిలా టాగూర్ నటించారు. ఈ చిత్రానికి ఓ.పి.నయ్యర్ సంగీతం పెద్ద ఎస్సెట్… అందుకు తగ్గట్టుగా ఎస్.హెచ్. బిహారీ పాటలు పలికించారు. బరువు, బాధ్యత లేని ఓ కోటీశ్వరుని వారసుడు కశ్మీర్ లోని తమ ఎస్టేట్ కు వెళతాడు. అక్కడ పూలమ్మే చంపాను చూసి ప్రేమిస్తాడు. ఆమెను పెళ్ళాడాలని అక్కడ ఉండే మరొకడు ప్రయత్నిస్తూంటాడు. అతను హీరోహీరోయిన్లకు పలు ఇక్కట్టు కలుగచేస్తాడు. చివరకు కోరుకున్న అమ్మాయిని హీరో పెళ్ళాడడంతో కథ సుఖాంతమవుతుంది. ‘కశ్మీర్ కీ కలీ’ మంచి విజయం సాధించింది. ఈ చిత్రం విడుదలైన 15 ఏళ్ళకు తెలుగులో యన్టీఆర్ హీరోగా కొన్ని మార్పులతో ‘శృంగారరాముడు’ తెరకెక్కింది.

