Tilak Varma: మన తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ తన ప్రతిభా పాఠవాలతో అచిరకాలంలోనే ఐసీసీ టాప్ ర్యాంకింగ్‌లో చోటు దక్కించుకున్నాడు. ఎడమ చేతి బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొంది, ఆఫ్ స్పిన్ బౌలర్‌గానూ రాణిస్తూ విశేష ఆదరణ పొందాడు. ఐసీసీ టీ-20 ర్యాంకింగ్‌లో దూసుకుపోయి ఒకేసారి టాప్-3 స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఒకేసారి 69 స్థనాలను ఆయన ఎగబాకడం విశేషం. ప్రతిభతో ఇంతగా మునుపెన్నడూ ఇలా ర్యాంకింగ్ పొందలేదని క్రికెట్ విశ్లేషకులే ముక్కున వేలేసుకుంటున్నారు.
Tilak Varma: ఐసీసీ టీ-20 ర్యాంకింగ్‌లో టాప్-1 స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన ట్రావిస్ హెడ్, టాప్-1 స్థానంలో ఇంగ్లండ్ క్రికెటర్ సాల్ట్ ఉన్నారు. ఆ తర్వాతి స్థానాన్ని మన తిలక్ కైవసం చేసుకోవడం క్రికెట్ అభిమానులకు తియ్యని వార్తే. అరంగేట్రం తర్వాత తిలక్ వర్మ కేవలం 20 మ్యాచుల్లోనే ఈ స్థానానికి చేరుకోవడం విశేషం. ఇటీవల సౌతాఫ్రికాపై వరుస సెంచరీలు చేసిన వర్మ మొతత్ం 51.33 సగటుతో 616 పరుగులు చేశాడు. ఆయన మరింత ఎత్తుకు చేరుకోవాలని ఆశిద్దాం.
