Drone Show

Drone Show: ఆకాశంలో 5 వేల డ్రోన్ లతో అద్భుతం.. ఇది చూస్తే ఫిదా అయిపోవడం పక్కా!

Drone Show: డ్రోన్ లతో అద్భుతాలు సృష్టించవచ్చు అని తెలిసిందే. ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీపై చాలా ఆసక్తి కూడా పెరుగుతోంది. వ్యవసాయం నుంచి అంతరిక్షం వరకూ డ్రోన్ టెక్నాలజీతో చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. అయితే, ఒక కంపెనీకి డ్రోన్ లతో ఆకాశంలో అద్భుత దృశ్యాలను ఆవిష్కరించడం భలే సరదా. ఇప్పటివరకూ ఎన్నో ఆకృతులను డ్రోన్ల మెరుపుల్లో అందించిన ఆ కంపెనీ తాజాగా క్రిస్మస్ సందర్భంగా భారీ శాంటా క్లాజ్ ఆకృతిని ఆకాశంలో ఆవిష్కరించింది. 5 వేల డ్రోన్ లతో శాంటా ఆకాశంలో విహరిస్తున్నట్టు చేసిన క్రియేషన్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. 

ఈ అద్భుతాన్ని ఆవిష్కరించిన కంపెనీ US-ఆధారిత డ్రోన్ కంపెనీ స్కై ఎలిమెంట్స్. టెక్సాస్‌లోని మాన్స్‌ఫీల్డ్‌లో క్రిస్మస్ సందర్భంగా ఒక మైదానంలో దూసుకుపోతున్న 5,000 UAVలు అంటే మానవరహిత వైమానిక వాహనాలు ఉన్నాయి. ఈ ప్రదర్శన కంపెనీకి కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను అందించింది. ఇదే కంపెనీ గతంలో ఉత్తర అర్ధగోళంలో ఒక వారం ముందు 2,500 డ్రోన్‌లను ఎగరేసింది. అప్పుడు అది గిన్నిస్ రికార్డుల కెక్కింది. ఇప్పుడు తన రికార్డును తానే తుడిచిపెడుతూ భారీ శాంటా ను ఆవిష్కరించింది. 

ఇది కూడా చదవండి: Bima Sakhi Yojana: ఎల్ఐసీ బీమా సఖి పధకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

స్కై ఎలిమెంట్స్-డ్రోన్ టెక్నాలజీ కంపెనీ UVify మధ్య సహకారం ద్వారా ఈ అద్భుతమైన ప్రదర్శన సాధ్యమైంది. ప్రదర్శనలో శాంటా క్లాజ్ తన స్లిఘ్‌లో కూచుని అభివాదం చేస్తుండగా.. రెండు రెయిన్ డీర్‌లు స్లిఘ్ ను లాగుతున్న దృశ్యం అద్భుతమైన ఆనందాన్ని ప్రేక్షకులకు పంచింది.  డ్రోన్‌లకు అనుసంధానించిన  క్లిష్టమైన LED లైట్ల కోసం సరైన నేపథ్యాన్ని సృష్టించడం, సాయంత్రం సమయంలో ఆకాశంలో చీకట్లు కమ్ముకుంటున్న వేళలో ఈ  ప్రదర్శన జరిగింది. 

ఖచ్చితత్వం -సమన్వయంతో, డ్రోన్‌లు గాలిలోకి ప్రవేశించాయి.  ప్రేక్షకులను అబ్బురపరిచే భారీ, మెరుస్తున్న ఆకృతులను వేగంగా కళ్ళముందుకు తీసుకువచ్చాయి.  బహుమతులతో నిండిన తన స్లిఘ్ నుండి చేతులు ఊపుతూ శాంటా కనిపించిన క్షణంలో.. ప్రేక్షకుల చప్పట్లతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది. 

ఇది కూడా చదవండి: Hajj: ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్ళేది ఎంతమంది అంటే..

ఇంటర్నెట్ లో సందడి.. 

ప్రత్యక్షంగా వీక్షించిన ప్రేక్షకుల స్పందన అలా ఉంటే.. ఇంటర్నెట్ లో చూసిన వారైతే ఫిదా అయిపోతున్నారు. వీడియో అప్‌లోడ్ అయిన దగ్గర నుంచి  ఇది వైరల్‌గా మారింది,  ఒక్క ఇన్‌స్టాగ్రామ్‌లోనే 98 మిలియన్ల వ్యూస్.. 5.5 మిలియన్ల లైక్‌లను కొట్టేసింది. ఈ వీడియో విపరీతంగా షేర్ అవుతోంది. 

ఆ వీడియో ఇక్కడ మీరూ చూసేయవచ్చు.. 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *