Treasure Hunt: కాసర్‌గోడ్ కుంబ్లా ఆరికడి కోటలో నిధి నిధి ఉంది అని చల్ల కలం గా పుకార్లు వస్తున్నాయి.. దింతో గత రాత్రి నిధిని సొంతం చేసూకోవడం కోసం పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ సహా 5 మందిని గుంతలు తవ్వుతుండగా వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు.
కాసరగోడ్ కుంబ్లా ఆరికడి కోట కేరళలో ఉంది. రాజుల కాలంలో నిర్మించిన ఈ కోటకు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఈ కోటను పురావస్తు శాఖ నిర్వహిస్తోంది. ఈ కోటలో రాజుల కాలంలో భద్రపరిచిన సంపద ఉందనే పుకార్లు చాలా కాలంగా పట్టణంలో ప్రచారంలో ఉన్నాయి. ఇది నిజమని నమ్మేవారూ ఉన్నారు.
ఇది కూడా చదవండి: Gas cylinder Explosion: వంట చేస్తుండగా..పేలిన గ్యాస్ సిలిండర్.. ఇద్దరు మృతి
ఈ కేసులో రెండు రోజుల క్రితం అర్ధరాత్రి కోట లోపల శబ్ధం రావడంతో ఆ ప్రాంత ప్రజలు వెళ్లి పరిశీలించారు. స్థానికులను చూసి ఇద్దరు పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే స్థానికులు వారిని పట్టుకుని కట్టేసి పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. కోట బావిలో నిధి ఉందని, దాన్ని తవ్వి తీయవచ్చని మొఘ్రాల్-పూడూర్ గ్రామపంచాయతీ వైస్ ప్రెసిడెంట్ ముజీబ్ కంబార్ తెలిపినట్లు అరెస్టయిన యువకులు పోలీసులకు తెలిపారు.
అనంతరం నిధిని తవ్వేందుకు ప్రయత్నించిన పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ సహా ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.