Curd: చాలా మంది ఆహారంలో ఎక్కువగా పెరుగు తీసుకుంటారు. పెరుగు వంటకం రుచిని పెంచుతుంది. ఇది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. పెరుగులో అనేక పోషకాలు ఉన్నాయి. ఇందులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. అవి మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. కానీ, పెరుగులో ఎన్ని పోషకాలు ఉన్నా సరే వాటిని కొన్ని ఆహార పదార్ధాలతో తింటే అవి కడుపులో విషంలా పనిచేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని ఆహార పదార్ధాలతో పెరుగు తీసుకోవడం మీ జీర్ణవ్యవస్థకు హానికరం. పెరుగుతో కలిపి తినడం వల్ల గ్యాస్, ఉబ్బరం, ఇతర జీర్ణ సమస్యలు వస్తాయి.
పండ్లు, పెరుగు:
నారింజ, ద్రాక్ష లేదా నిమ్మకాయలు వంటి పుల్లని పండ్లతో పెరుగు తినడం వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడి జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది. పుల్లని పండ్లు, పెరుగు రెండూ వేర్వేరుగా జీర్ణమవుతాయి, ఇది కడుపులో అసమతుల్యతను కలిగిస్తుంది.
చక్కెర, పెరుగు:
కొంతమంది పెరుగులో చక్కెరను తీనడానికి ఇష్టపడతారు, కానీ ఈ కలయిక కడుపుకు మంచిది కాదు. పెరుగులో చక్కెర కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. శరీరంలో అలెర్జీలు లేదా మంట వంటి సమస్యలు వస్తాయి.
బంగాళదుంపలు, పెరుగు:
బంగాళదుంపలు, పెరుగు మిశ్రమాన్ని తినడం వల్ల సాధారణంగా కడుపు తిమ్మిరి, అపానవాయువు వస్తుంది. బంగాళదుంపలలో స్టార్చ్ , పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, ఈ రెండూ వేర్వేరు జీర్ణ కారకాలు. వీటిని కలిపి తింటే కడుపునొప్పి వస్తుంది.
చేపలు, పెరుగు:
చేపలు, పెరుగు కలిపి తింటే జీర్ణక్రియ దెబ్బతింటుంది. చేపల ప్రోటీన్ , పెరుగులో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది, ఇది కలిసి జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. ఇలా చేయడం వల్ల గ్యాస్, హెవీనెస్ వంటి పొట్ట సమస్యలు వచ్చే అవకాశం ఉంది.