Maharashtra Elections 2024: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ గడువు ముగియడంతో ఎలక్షన్ పిక్చర్ క్లియర్ అయింది. ఈసారి శివసేన, ఎన్సీపీ లతో బాటు 6 పెద్ద పార్టీలు బరిలో నిలిచాయి. ఈసారి రెబల్స్ ఎక్కువగా నామినేషన్ వేశారు. రాష్ట్రంలోని దాదాపు ప్రతి సీటులోనూ రెబల్స్ ఉన్నారు. ఇప్పుడు అందరి చూపు నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 4 పైనే ఉంది. ఆ తర్వాత పోరు ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఈసారి 7,995 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజు ఒక్కరోజే 4,996 మంది ఫామ్స్ సబ్మిట్ చేశారు.
ఇది కూడా చదవండి: Karnataka: మనీలాండరింగ్ కేసులో కర్ణాటక మాజీ ముడా కమిషనర్ అరెస్ట్
Maharashtra Elections 2024: నామినేషన్ల పర్వం ముగిసినప్పటికీ ఇంకా మహాయుతి, ఎంవీఏ సీటు షేరింగ్ ఫార్ములాను వెల్లడించలేదు. అభ్యర్థులను పరిశీలిస్తే మహాయుతిలో 148 మంది అభ్యర్థులతో బీజేపీ, ఎంవీఏలో 103 మందితో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా ఉన్నాయి. రెండు పార్టీలు 2019 అసెంబ్లీ ఎన్నికల కంటే తక్కువ స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. గతసారి బీజేపీ 164 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టగా, కాంగ్రెస్ 147 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. కాగా, శివసేన-షిండే 80 స్థానాల్లో, ఎన్సీపీ-అజిత్ 53 స్థానాల్లో, శివసేన- ఉద్ధవ్ 89 స్థానాల్లో, ఎన్సీపీ- శరద్ 87 స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటించారు. గత ఎన్నికల్లో శివసేన), ఎన్సీపీ 124 స్థానాల్లో పోటీ చేశాయి.