Imran Patel: బుధవారం (నవంబర్ 27) రాత్రి పూణెలోని గార్వేర్ స్టేడియంలో లక్కీ బిల్డర్స్ మరియు యంగ్ XI మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఇమ్రాన్ పటేల్ అనే 35 ఏళ్ల ప్రొఫెషనల్ క్రికెటర్ గుండెపోటుతో మరణించాడు. ఇమ్రాన్ పటేల్ లక్కీ బిల్డర్స్ తరపున ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా క్రీజులోకి దిగీ కొన్ని ఓవర్లు ఆడాడు, తర్వాత అతనికి ఎడమ చేయి ఇంకా ఛాతిలో నొప్పి రావడంతో అంపైర్‌లకు ఇంకా ఇతర ఆటగాళ్లకు చెప్పగా.
ఇది కూడా చదవండి: Hyderabad: 2026లో హైదరాబాద్‌లో ఖేలో ఇండియా క్రీడలు
Imran Patel: కొద్దిసేపు చర్చల తర్వాత తిరిగి పెవిలియన్‌కు వెళ్తుండగా బౌండరీ దగ్గర కుప్పకూలిపోయాడు. మ్యాచ్ లైవ్ స్ట్రీమ్ అవుతుండగా ఈ ఘటనలు కెమెరాకు చిక్కాయి. పటేల్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. “అతనికి ఎలాంటి వైద్య పరిస్థితి లేదు” అని మరో క్రికెటర్ నసీర్ ఖాన్ ఇలా అన్నారు. “అతను మంచి శారీరక స్థితిలో ఉన్నాడు అని . నిజానికి, అతను ఆటను ఇష్టపడే ఆల్‌రౌండర్. అతనికి ఇలాజరగడంతో ఇంకా షాక్‌లో ఉన్నాము అన్ని అన్నారు.ఇమ్రాన్ పటేల్ కు భార్య ఇంకా ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. నాలుగు నెలల ముందే అంతానికి మూడోవ పాపా జన్మించింది. మౌలానా ఆజాద్ కళాశాల సమీపంలో ఆయన అంత్యక్రియల కోసం భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.