Nagababu: ఆయనకు సేవా చేస్తా.. నా లైఫ్ అయినా ఇస్తా..

Nagababu: జనసేన నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నయ్య మెగా బ్రదర్స్ లో ఒకరు నాగబాబుకు రాజ్య‌స‌భ సీటు వస్తుందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నాగబాబు ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పందించారు.

“అతను స్వార్థం తెలియని ప్రజానాయకుడు. అతని ప్రతి పని ప్రజా శ్రేయస్సు కోసమే. వ్యక్తిగత స్వార్థానికి అతనెప్పుడు దూరంగానే ఉంటాడు. అతను ఎప్పుడు సత్యానికి, ధర్మానికి కట్టుబడి ఉంటాడు. మన రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం ఎంతవరకైనా వెళ్లి పోరాడుతాడు. ఢిల్లీ వెళ్లింది మన రాష్ట్ర ప్రయోజనాల కోసమే.

వ్య‌క్తిగ‌త‌ స్వార్థ ప్రయోజనాల కోసం కాదు. అలాంటి నాయకుడి కోసం నా లైఫ్‌ని ఇవ్వడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను. నా నాయకుడికి సేవ చేయడం తప్ప నాకు వేరే రాజకీయ ఆశయం లేదు” అని నాగ‌బాబు ట్వీట్ చేశారు.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Pawan Kalyan: హోమ్ మినిస్టర్ అనితకు పవన్ మాస్ వార్నింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *