Kumuram Bheem Asifabad: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. పులి దాడిలో ఓ యువతి మృతి చెందిన ఘటనతో కలకలం చోటుచేసుకున్నది. దీంతో జిల్లాలో భయాందోళన నెలకొన్నది. అటవీ సమీప గ్రామాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాయి. ఏ సమయంలో ఎటు వైపు నుంచి పులి వస్తుందోనని ఆందోళనతో ఉన్నారు. పొలాల్లో పనులు చేసుకునే రైతులు, కూలీలు మరింత భయాందోళనతో గడుపుతున్నారు.
Kumuram Bheem Asifabad: ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం బెంగాలీ క్యాంప్ 6వ నెంబర్ సమీపంలోని గన్నారం గ్రామానికి చెందిన మోర్లే లక్ష్మి (21)పై పులి దాడి చేసింది. గొంతుపై తీవ్ర గాయాలై ఆయన మరణించింది. దీంతో మృతురాలి బంధువులు, గ్రామస్థులు కాగజ్‌నగర్ పట్టణంలోని అటవీశాఖ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.