Hyderabad: 2026లో హైదరాబాద్‌లో ఖేలో ఇండియా క్రీడలు

Hyderabad : హైదరాబాద్ వేదికగా ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్‌రెడ్డి గురువారం న్యూఢిల్లీలో వెల్లడించారు. 2026లో ఈ క్రీడలు హైదరాబాద్‌లో నిర్వహిస్తామని తెలిపారు. హైదరాబాద్ వేదికగా ఈ క్రీడలు నిర్వహించాలని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మనుసుఖ్ మాండవ్యాకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారని తెలిపారు. దీనిపై కేంద్ర మంత్రి మాండవ్యా సూత్రప్రాయంగా అంగీకరించారన్నారు.

గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్, సరూర్‌‌‌‌నగర్‌‌‌‌ మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, ఎల్బీ స్టేడియంలో ఇండోర్ స్టేడియం, కేవీబీఆర్ ఇండోర్ స్టేడియం, హుస్సేన్ సాగర్‌‌‌‌లో వాటర్ స్పోర్ట్స్, ఉస్మానియా క్యాంపస్‌‌‌‌లో సైక్లింగ్ వెల్‌‌‌‌డ్రోమ్, జింఖానా-2 గ్రౌండ్‌‌‌‌లో ఫుట్ బాల్ గ్రౌండ్‌‌‌‌తో పాటు ఔట్ డోర్ గేమ్స్ నిర్వహించే వసతులు ఉన్నాయని వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా యువతను ప్రోత్సహించేలా ప్రత్యేక పాలసీని రూపొందిస్తుందని తెలిపారు. ఈ విజ్ఞప్తి పై కేంద్ర మంత్రి తక్షణమే సానుకూలంగా స్పందించినట్లు జితేందర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఇకపై క్రీడా పోటీల నిర్వహణతో పాటు భవిష్యత్తులో ఉత్తమ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన అవగాహనతో ఉందని ఆయన పేర్కొన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  ఏపీకి మళ్ళీ అల్పపీడన దెబ్బ.. వర్షాలు అప్పుడే ఆగకపోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *