Preyasi Raave

Preyasi Raave: పాతికేళ్ళ ‘ప్రేయసి రావే

Preyasi Raave: శ్రీకాంత్, రాశి, పృథ్వీ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘ప్రేయసి రావే’. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.రామానాయుడు నిర్మించిన ఈ చిత్రం ద్వారా చంద్ర మహేశ్ దర్శకునిగా పరిచయం అయ్యారు. 1999 నవంబర్ 19న ‘ప్రేయసి రావే’ జనం ముందు నిలచింది. అనుకోని పరిస్థితుల్లో ఓ అమ్మాయి తాను ప్రేమించిన వాడిని కాకుండా వేరే వ్యక్తిని పెళ్ళాడవలసి వస్తుంది. ప్రియుడు ఆమెను తనతో వచ్చేయమని చెబుతూ ఉంటాడు. భర్తను ప్రేమించడం మొదలెట్టిన ఆ అమ్మాయి ప్రియుడి మాటను మన్నించదు. ఆమె భర్తకు గుండె ఆపరేషన్ చేయవలసి ఉంటుంది. హీరో తాను చనిపోతూ, తన గుండెను ఆమె భర్తకు అమర్చమని చెబుతాడు. దాంతో కథ ముగుస్తుంది. ఈ చిత్రానికి శ్రీలేఖ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం దర్శకునిగా చంద్రమహేశ్ కు మంచి పేరు సంపాదించి పెట్టింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  High Court: RGV ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *