Panchadara Chilaka: రీమేక్స్ తెరకెక్కించడంలో తనకంటూ ఓ బాణీ ఏర్పరచుకున్నారు కోడి రామకృష్ణ.. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘పంచదార చిలక’ తమిళంలో విజయం సాధించిన ‘ఒరుతలై రాగం’ ఆధారంగా తెరకెక్కింది. శ్రీకాంత్, కౌసల్య జంటగా నటించిన ఈ చిత్రం 1999 అక్టోబర్ 29న విడుదలైంది. ఇందులో హీరో, హీరోయిన్ ని ప్రేమిస్తాడు- అది చెప్పలేడు. తన చుట్టూ పరచుకున్న పరిస్థితుల కారణంగా హీరోయిన్ కూడా తన ప్రేమను హీరోకు తెలుపలేకపోతుంది. చివరకు చెప్పాలని వస్తే అతను చనిపోయి ఉంటాడు. ఇది తమిళ కథ. అదే కథలో కొన్ని మార్పులు చేశారు. తెలుగులో హీరో బతికేలా తెరకెక్కించారు. ఈ చిత్రానికి ఎస్.ఏ.రాజ్ కుమార్ బాణీలు కట్టారు. సీతారామశాస్త్రి పాటలు పలికించారు. తెలుగులో ‘పంచదార చిలక’ అంతగా అలరించలేకపోయినా, పాటలు కొన్ని జనాన్ని ఆకట్టుకున్నాయి.

