Tejashwi Yadav: ఒక మహిళ సంక్షేమ పథకంలో రూ. 200 మోసపోయినట్లు ఆరోపిస్తూ, ఎఫ్ఐఆర్లో తేజశ్వి యాదవ్ పేరును పేర్కొంది. బిహార్‌లోని దర్భంగా జిల్లా సింగ్వారా ప్రాంతానికి చెందిన గుడియా దేవి అనే మహిళ ఈ కేసులో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు ప్రకారం, ప్రభుత్వం ‘మై-బహెన్ యోజన’ (అమ్మ-సోదరి పథకం) కింద రూ. 2,500 ఇస్తుందని ప్రచారం జరిగింది. ఈ పథకానికి అర్హత పొందాలంటే, దరఖాస్తుదారులు తేజశ్వి యాదవ్‌కు రూ. 200 చెల్లించాలని చెప్పారట. గుడియా దేవి, ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు తేజశ్వి యాదవ్‌కు రూ. 200 చెల్లించినట్లు ఆరోపించింది. అయితే, చాలా కాలం తర్వాత కూడా ఆమెకు పథకం కింద ఎలాంటి డబ్బులు రాలేదు.
ఇది కూడా చదవండి: India-US Trade War: ట్రంప్ 50% సుంకాలు విధించిన తర్వాత.. ఢిల్లీకి అమెరికా ప్రతినిధుల బృందం
దీంతో తాను మోసపోయానని గ్రహించి, సింగ్వారా పోలీస్ స్టేషన్లో తేజశ్వి యాదవ్‌పై ఫిర్యాదు చేసింది. ఇదే తరహాలో, వితంతు పింఛన్ పథకంలో మోసం జరిగిందని ఆరోపిస్తూ అదే ప్రాంతానికి చెందిన మరో మహిళ కూడా తేజశ్వి యాదవ్‌పై ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులు రాజకీయంగా ప్రతీకార చర్యల్లో భాగమని RJD నాయకులు ఆరోపిస్తున్నారు.
రూ. 200 వంటి చిన్న మొత్తంలో మోసం చేశారనే ఆరోపణలు విచిత్రంగా ఉన్నాయని, ఇది తేజశ్వి యాదవ్‌ను ఎన్నికలకు ముందు అప్రతిష్ఠపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని వారు పేర్కొన్నారు. పోలీసులు ఈ ఫిర్యాదులను స్వీకరించి, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసు విచిత్రంగా ఉన్నప్పటికీ, బిహార్ రాజకీయాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుల వెనుక రాజకీయ ప్రతీకారం ఉందా, లేదా నిజంగానే మోసం జరిగిందా అనేది విచారణలో తేలాల్సి ఉంది.