Hyderabad: హైదరాబాద్ నగరంలో గంజాయి విక్రయించే గ్యాంగులు హల్చల్ చేస్తున్నాయి. ఎవరికైనా గంజాయి, డ్రగ్స్ కావాలంటే కేవలం ఫోన్ చేస్తే చాలు.. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడికి డెలివరీ చేసేలా సేవలు అందిస్తున్నారు. తాజాగా మరోసారి హైదరాబాద్ మహానగరంలో భారీగా గంజాయి పట్టుబడింది. గచ్చిబౌలిలో భారీగా గంజాయిని శంషాబాద్ డిటిఎఫ్( డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్) అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
గచ్చిబౌలి నానక్‌రామ్ గూడాలో కారులో తరలిస్తున్న 20 కేజీల గంజాయిని అధికారులు సీజ్ చేశారు. ఒరిస్సా రాష్ట్రాం మాల్కన్‌గిరి జిల్లాకు చెందిన బిక్రం హిరా (24) హైదరాబాద్‌కి గంజాయి తరలిస్తుండగా 20 కేజీల 13 డ్రై గంజాయి ప్యాకెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కారు డిక్కీలో రహస్యంగా సొరగు ఏర్పాటు చేసి గంజాయి తరలిస్తున్నారు. గంజాయి తరలిస్తున్న కారును అధికారులు సీజ్ చేశారు. ఆరియై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు.

