Dosa: అనంతపురం జిల్లా తపోవనంలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. దోసె ముక్క గొంతులో ఇరుక్కుపోయి ఓ రెండేళ్ల బాలుడు ఊపిరాడక మృతి చెందాడు. ఈ ఘటన స్థానికులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.
ప్రాణం తీసిన దోసె
తపోవనానికి చెందిన అభిషేక్, అంజినమ్మ దంపతులకు రెండేళ్ల కుమారుడు కుశాల్ ఉన్నాడు. శుక్రవారం ఉదయం కుశాల్ దోసె తింటుండగా, పెద్ద ముక్క ఒక్కసారిగా గొంతులో ఇరుక్కుపోయింది. చిన్నారి ఊపిరి పీల్చుకోలేక ఆక్సిజన్ ఆగిపోయింది.
ఇది కూడా చదవండి: Donald Trump: మాతో తలపడితే అంతే: బ్రిక్స్ దేశాలకు ట్రంప్ వార్నింగ్
గమనించిన తల్లిదండ్రులు వెంటనే స్పందించి ముక్కను బయటకు తీయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వెంటనే సర్వజనాసుపత్రికి తరలించగా, చికిత్స అందక ముందే కుశాల్ మృతి చెందాడు. కళ్లముందే ముద్దుల కుమారుడు కన్నుమూయడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
తల్లిదండ్రులకు మరోసారి హెచ్చరిక
ఈ ఘటనతో తపోవనం ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. చిన్నారులు తినే ఆహారం విషయంలో తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు. పిల్లలకు పెద్ద ముక్కల ఆహారం ఇవ్వకుండా, తినేటప్పుడు పర్యవేక్షించడం చాలా ముఖ్యమని వైద్యులు కూడా చెబుతున్నారు.
గొంతులో దోశ ఇరుక్కుని రెండేళ్ల బాలుడు మృతి.
తపోవహానికి చెందిన కుశల్(2) దోశ తింటుంటుగా గొంతులో ఇరుకొని ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.
ఆసుపత్రికి తల్లితండ్రులు తీసుకువెళ్లగా అప్పటికే చనిపోయినట్టు ప్రకటించిన వైద్యులు.#CrimeNews #apnews pic.twitter.com/NSvEdlRFEf
— s5news (@s5newsoffical) July 19, 2025