Ram Charan

Ram Charan: 18 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ.. రామ్ చరణ్ పెద్ది నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్

Ram Charan: టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినీ రంగంలోకి అడుగుపెట్టి నేటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ ప్రయాణంలో ఆయన తెలుగు సినిమాకు ఎన్నో మైలురాళ్లు సృష్టించి, దేశం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టారు. ‘చిరుత’తో ఎంట్రీ ఇచ్చిన చరణ్, ‘మగధీర’, ‘రంగస్థలం’, ‘RRR’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించారు.

ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న ‘పెద్ది’ సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

రా అండ్ రస్టిక్ లుక్‌లో చరణ్

పోస్టర్‌లో రామ్ చరణ్ గడ్డం, మాసిన జుట్టు, ముక్కుకు పోగు, నోటిలో బీడీతో పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. నల్లటి అంగీ, ఎర్ర చారల చొక్కా ధరించి, రైలు పట్టాలపై నించున్న ఈ లుక్ అభిమానులను ఊరేసేస్తోంది. వెనుక బ్యాగ్, అందులో బ్యాట్ ఉంచిన డిజైన్ సినిమా కథలోని మాస్ అట్మాస్ఫియర్‌ను సూచిస్తోందని అభిమానులు సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. ఈ లుక్‌తో ‘పెద్ది’పై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

ఇది కూడా చదవండి: Ragging: ర్యాగింగ్ పేరుతో చితకబాదిన తోటి విద్యార్థులు.. వీడియో వైరల్

భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమా

‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాను మైత్రి మూవీ మేకర్స్, వ్రిద్ది సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

రిలీజ్ డేట్ ఫిక్స్

భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీ 2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 18 ఏళ్ళ సినీ ప్రస్థానంలో రామ్ చరణ్‌కు ‘పెద్ది’ మరొక మైలురాయిగా నిలుస్తుందా? అనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *