మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో భారీగా మత్తు పదార్థాలు దొరికాయి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, గుజరాత్ ఏటీఎస్ సంయుక్త ఆపరేషన్ నిర్వహించి రూ.1800 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్నారు. భోపాల్ సమీపంలోని ఓ పరిశ్రమపై నిర్వహించిన దాడిలో ఈ భారీ డ్రగ్ రాకెట్‌ను గుర్తించారు.
ఈ ఫ్యాక్టరీలో మెఫెడ్రోన్ డ్రగ్ తయారు చేస్తున్నట్టు గుర్తించారు. అక్రమంగా డ్రగ్స్ తయారీకి సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.