హర్యానా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఓ రేంజ్ లో వెళ్తుంటే ఆప్ పార్టీ మాత్రం అట్టర్ ఫ్లాప్ దిశగా వెళ్తుంది.జమ్మూ కశ్మీర్‌లో మాత్రం ఎన్‌సీ, కాంగ్రెస్ కూటమి హవా కొనసాగుతుంటే.. హర్యానా లో బీజేపీ విజయం దిశగా వెళ్తుంది.
ఆప్ మాత్రం అడ్రస్ గల్లంతైంది. జమ్మూ కశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే, రెండు రాష్ట్రాల్లోనూ పోటీ చేసిన ఏ ఒక్కస్థానంలోనూ ఖాతా తెరవకపోవడం గమనార్హం.