Zombie Reddy 2

Zombie Reddy 2: జాంబీ రెడ్డి 2: ఈసారి ఇంటర్నేషనల్!

Zombie Reddy 2: తెలుగు సినిమాల్లో జాంబీ కాన్సెప్ట్‌ను మొదటిసారి పరిచయం చేసిన జాంబీ రెడ్డి చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నది. కరోనా మధ్యకాలంలో రాయలసీమ నేపథ్యంతో సటైర్ టచ్‌తో వచ్చి, అందరినీ ఆకర్షించింది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ రానుంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ మరోసారి హీరో తేజ సజ్జాతో చేతులు కలిపి, జాంబీ రెడ్డి 2ను తెరకెక్కించనున్నారు. పాన్-ఇండియా లెవెల్‌లో తేజ క్రేజ్ పెరిగిన ఈ సమయంలో, ఈ సినిమా అంతర్జాతీయ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా రూపొందుతోంది. దీంతో అభిమానుల్లో భారీ ఎక్సైట్‌మెంట్ నెలకొంది.

Also Read: Pooja Hegde: దుల్కర్ సల్మాన్ 41వ సినిమా: పూజా హెగ్డే ఎంట్రీ!

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ద్వారా ఈ సీక్వెల్ రాబోతుంది. మొదటి భాగంలో రాయలసీమలో జాంబీల దాడి చుట్టూ తిరిగిన కథ, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది. . ప్రశాంత్ వర్మ ఈసారి ఇంటర్నేషనల్ లెవెల్ లో మెప్పించబోతున్నాడు. VFX వర్క్ ఇప్పటికే ప్రారంభమైందని టాక్. సంక్రాంతి 2027కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. టాప్ స్టార్స్ క్యాస్టింగ్ సర్‌ప్రైజ్‌గా ఉంటుందని, పాన్-ఇండియా రేంజ్‌లో ఈ చిత్రం తెలుగు జాంబీ యూనివర్స్‌ను ప్రపంచానికి పరిచయం చేస్తుందని మేకర్స్ ఆశిస్తున్నారు. మొత్తానికి ఇది తేజ సజ్జా కెరీర్‌లో మరో మైలురాయిగా మారనుంది. మరి ఈ సినిమా ఎలా మెప్పిస్తుందో చూడాలి.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Amala Paul: అమలాపాల్ సాహసం: నగ్న సన్నివేశంపై షాకింగ్ కామెంట్స్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *