Ysrcp: ఏపీ ఎన్నికల ఫలితాల తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బల పరంపర కొనసాగుతోంది. తాజాగా, శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా ఉన్న జకియా ఖానమ్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం పార్టీకి పెద్ద షాక్‌గా మారింది. గతంలో టీటీడీ వీఐపీ దర్శనం సిఫారసు వివాదంలో చిక్కుకున్న ఆమె, అప్పటి నుండి పార్టీలో తక్కువగా కనిపిస్తున్నారు. ఇప్పుడు ఆమె బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
బుధవారం ఉదయం 11 గంటల సమయంలో ఆమె బీజేపీ నేతలు దగ్గుబాటి పురంధేశ్వరి, సత్యకుమార్‌లతో సమావేశం అవనునాటు తెలుస్తుంది. మంగళవారం రాత్రే ఆమె తన రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి మెయిల్ ద్వారా పంపినట్టు తెలుస్తోంది. 2020లో గవర్నర్ నామినేషన్ ద్వారా ఎమ్మెల్సీగా నియమితులైన జకియా ఖానమ్, ఈ నిర్ణయం ద్వారా వైసీపీకి రాజ్యాంగ సంస్థల్లోనూ పెద్ద నష్టం కలిగించారు.
ఇది కూడా చదవండి: Uttam Kumar Reddy: ధాన్యం కొనుగోళ్లపై హరీశ్‌రావు అబద్ధాలు మానుకోవాలి
ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మొత్తం ఆరుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేతృత్వంపై అసంతృప్తితో నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకే పరిమితమైన వైసీపీ పరిస్థితి రోజు రోజుకీ క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో నేతలంతా తమ భవిష్యత్తు కోసం కొత్త రాజకీయ ఆశ్రయాలను అన్వేషిస్తున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్‌లో భవిష్యత్‌పై స్పష్టత లేకపోవడం వల్లే నాయకులు పార్టీని వదిలి వెళ్లిపోతున్నారు. ఇది కేవలం ఒక వ్యక్తిగత నిర్ణయం కాదని, మొత్తం పార్టీ పరిస్థితిపై ప్రతిబింబం అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.