ys sharmila

YS Sharmila: నా బిడ్డలపై ప్రమాణం చేస్తా.. జగన్‌, సుబ్బారెడ్డి చేస్తారా

YS Sharmila: ప్రజలు ఇప్పుడిప్పుడే కల్తీ లడ్డూల గురించి మరిచిపోతున్నారు.జగన్ మోచేతి నీళ్లు తాగే వ్యక్తి.. సుబ్బారెడ్డి..సుబ్బారెడ్డి, ఇంకా అయన  కుమారుడు ఆర్థికంగా లాభపడ్డారు. రేపు సాయిరెడ్డి కూడా సుబ్బారెడ్డి లాగే మాట్లాడుతారు .సుబ్బారెడ్డి, సాయిరెడ్డిలో కొంచెమైనా నిజాయితీ ఉందేమో అనుకున్నా..సుబ్బారెడ్డి, సాయిరెడ్డి గురించి అమ్మకు తెలియాలనే వారి పేర్లు ప్రస్తావించా. నేను చెబుతున్నది నిజమని ప్రమాణం చేస్తా.. సుబ్బారెడ్డి కూడా చేస్తారా..అందరికీ సమాన వాటా ఉండాలని వైఎస్ అనుకున్నారు.నేను చెబుతున్నది నిజమని బిడ్డలపై ప్రమాణం చేస్తా..నిన్న చెప్పిన విషయాలన్నీ నిజమని సుబ్బారెడ్డి ప్రమాణం చేయగలరా..పేర్లు పెట్టుకున్నంత మాత్రాన ఆస్తులు ఇవ్వాలని ఉందా అని సుబ్బారెడ్డి అన్నారు.ఆస్తులు భారతికి చెందినవైతే ఆమె కూడా జైలుకు వెళ్లాలి కదా? ఆస్తులు నావైతే నేను కూడా జైలుకు వెళ్లాలని సుబ్బారెడ్డి అన్నారు.గిఫ్ట్ ఇస్తానని ఎవరైనా ఎంవోయూ రాసుకుంటారా..సుబ్బారెడ్డి.. ఆలోచించి మాట్లాడాల్సింది..ఈ గొడవలు ప్రతి ఇంట్లో ఉంటాయని అంటున్నారు..కన్న తల్లిని కోర్టుకు లాగడం.. ఘర్ ఘర్ కి కహాని ఎలా అవుతుంది..కన్న తల్లిని కోర్టుకు లాగిన వ్యక్తి ఎవరైనా ఉంటారా..జగన్ కోసం నేను, అమ్మ చాలా కష్టపడ్డాం.నేను 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేశా..నేను తప్పు చేశానో చెప్పాలని వైసీపీ నేతలు, కార్యకర్తలను అడుగుతున్నా..

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *