YS Sharmila

YS Sharmila: జగన్ ఓవర్ యాక్షన్ వల్లే.. వ్యక్తి మృతి

YS Sharmila: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ ఉద్రిక్తత చెలరేగింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై, ఆయన సోదరి వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై మాట్లాడుతూ, షర్మిల జగన్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

కారు పైనుంచి ప్రయాణించడమే తప్పు

జగన్‌ ప్రమాదానికి గురైన ఘటనపై స్పందించిన షర్మిల.. కారు సైడ్ బోర్డుపై నిలబడి ప్రయాణించడమే తప్పు. అది నియమలా  ఉల్లంఘన. అదే సమయంలో ప్రజలకూ ప్రమాదం అని అన్నారు. జగన్ షేక్‌ హ్యాండ్‌ ఇస్తున్న సందర్భంలోనే ఈ ప్రమాదం జరిగిందని ఆమె గుర్తు చేశారు.

 ప్రజల్ని మోసగించడంలో జగన్‌కి మించిన వారు లేరు

జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల మద్యకి రాలేదు. కానీ ఇప్పుడు ప్రజల మధ్యకి వచ్చి బలప్రదర్శన చేస్తున్నారు. ఇది నాటకం  కాకా మరి ఏంటిది? అంటూ షర్మిల ప్రశ్నించారు.మానవత్వం గురించి మాట్లాడే ముందు, మనుషులపైకి కార్లు ఎక్కించే వ్యవహారాలు మానుకోండి అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు.

ఇది కూడా చదవండి: Iran: కాల్పుల విరమణ తర్వాత కూడా ఇరాన్ దాడి.. 8 మంది మృతి

నిబంధనలు జగన్‌కి వర్తించవా?

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మూడు వాహనాలు అనుమతిస్తే, జగన్‌ 30 వాహనాలతో ప్రయాణించడం ఏంటి? ఆయనకి నిబంధనలు వర్తించవా?” అని షర్మిల నిలదీశారు.

ఇది ప్రజల భద్రత విషయం 

ప్రజల బహిరంగ సమూహాల్లో, ఇలాంటి అనియంత్రిత ర్యాలీలు, వాహనాల ప్రవాహం ప్రజల భద్రతను సైతం ప్రమాదంలో పడేస్తోంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే గంభీరంగా తీసుకోవాలి అని ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Anantapur: అనంతపురం యూనివర్సిటీలో అమ్మాయిల భద్రత ప్రశ్నార్థకమా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *