YS Sharmila: గౌతమ్ అదానీ దేశం పరువు తీస్తే జగన్ ఏపీ పరువు తీశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల విమర్శించారు. అదానీ కేసులో జగన్ లంచం తీసుకున్నట్టు స్పష్టంగా ఉందన్నారు.జగన్ కు రూ.1,750 కోట్ల గౌతమ్ అదానీ లంచం ఇచ్చినటు అమెరికా ఏజెన్సీల దర్యాప్తులో స్పష్టంగా వెల్లడైందని ఆమె అన్నారు. గౌతమ్ అదానీ భారత్‌లో కొన్ని ఒప్పందాలు చేసుకున్నారని.. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాల సీఎంలకు లంచాలు ఇచ్చినట్టు వెల్లడైంది అని చెప్పుకొచ్చారు.జగన్ అమెరికాకు డైరెక్ట్ ఇన్‌వాల్వ్‌మెంట్ లేనందునే.. ఆరోపణల్లో జగన్ పేరును నేరుగా అమెరికా ప్రస్తావించలేదన్నారు. ఒక్క సోలార్ ప్రాజెక్టలోనే అదానీ రూ.17 వందల కోట్లు ఇచ్చారంటే.. మిగిలిన ప్రాజెక్టుల్లోనూ ఇంకెంత లంచం ముట్టిందో అని మండిపడ్డారు. విశ్వసనీయత అనే పదానికి అర్ధం తెలుసా అని షర్మిల ప్రశ్నించారు.