YS Jagan: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రంగా విమర్శించారు. ఏజెంట్లు లేకుండా ఎలా ఎన్నికలు జరిపారో అని ప్రశ్నించారు జగన్. పోలింగ్ ముగిసిన తర్వాత ఫారం 32లో ఓట్ల వివరాలు నమోదు చేయాలి, బ్యాలెట్ బాక్స్‌కి సీల్ వేసే ముందు ఏజెంట్లు అక్కడే ఉండాలి, ఆ సీల్‌పై కూడా ఏజెంట్ల సంతకం ఉండాలని గుర్తు చేశారు. “ఈ ప్రక్రియలో ఏమైనా జరిగిందా?” అని జగన్ నిలదీశారు.
జగన్ ఆరోపిస్తూ.. ప్రజాస్వామ్యం కాపాడటానికి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని ప్రశ్నించాలి. లేదంటే డెమోక్రసీ బ్రతకదు. ఇప్పుడు ఎన్నికలు జరగడం కాదు, అధికార పార్టీ గుద్దుకోవడం మాత్రమే జరుగుతోంది. చంద్రబాబు తో కలిసిన అధికారులు, పసుపు మీడియా కలిసి ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచారు. బందిపోటు దొంగల్లా చొరబడి ఓట్లు వేయించారు. పోలీసులే దగ్గరుండి పోలింగ్ చేయించారు” అని అన్నారు.
ఇది కూడా చదవండి: Suresh Raina: మాజీ క్రికెటర్ సురేష్ రైనాకు ఈడీ సమన్లు జారీ
అలాగే, “మీకు నిజంగా ప్రజలు మద్దతు ఇస్తే ఎన్నికలు రద్దు చేసి, కేంద్ర బలగాల పర్యవేక్షణలో మళ్లీ ఎన్నికలు జరపండి” అని ఛాలెంజ్ విసిరారు. ప్రతీ బూత్‌కి సంబంధించిన వెబ్‌కాస్టింగ్‌ను బయటపెట్టే ధైర్యం ఉందా అని అడిగారు. “ఇలాంటి అడ్డగోలు రాజకీయాలు చేసే వారిని నాయకుడు అనరు, ఫ్రాడ్‌స్టర్ అంటారు” అని జగన్ ఘాటుగా వ్యాఖ్యానించారు.