Uttar Pradesh: తన యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వడానికి నిరాకరించిన పోలీసు అధికారిని యూట్యూబర్ బెదిరించిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన యూట్యూబర్ మష్కూర్ రజా దాదా అనే వ్వక్తి సంభాల్ సర్కిల్ ఆఫీసర్ అనుజ్ కుమార్ చౌదరిను తన యూట్యూబ్ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇవ్వాలి అని కోరగా పోలీస్ ఆఫీసర్ దాని నిరాకరించారు.. దింతో తనకి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ప్రశాంత్ కుమార్ తెలుసనీ వల్ల పేర్లు ఉపయోగించి.. ఆఫీసర్ పైన ఒత్తిడి తెచ్చాడు.
యూట్యూబర్ నవంబర్ 24న సంభాల్‌లో జరిగిన హింసకు సంబంధించి చౌదరిని ఇంటర్వ్యూ చేయాలనుకున్నారు.
ఇది కూడా చదవండి: Viral Video: అలా ఎలా రా బాబూ . . రైలు కింద కూచుని జర్నీ చేసిన ప్రబుద్ధుడు !
Uttar Pradesh: సంభాల్ కొత్వాలి స్టేషన్ ఆఫీసర్ అనూజ్ కుమార్ యూట్యూబర్ దాదాని అరెస్ట్ చేశారు. ప్రజా శాంతికి విఘాతం కలిగించినందుకు ఇంకా ఇంటర్వ్యూ కోసం సర్కిల్ ఆఫీసర్ ని బెదిరించినకు కాను అరెస్ట్ చేశాం అని పోలీస్ ఆఫీసర్ అనూజ్ కుమార్ తెలిపారు.తర్వాత జైలు కి పంపించారు.
సోమవారం జైలుకు వెళ్లే ముందు దాదా విలేకరులతో మాట్లాడుతూ తాను బీజేపీ కార్యకర్తనని పేర్కొన్నారు.
“నాకు యూట్యూబ్ ఛానెల్ ఇంకా రవాణా వ్యాపారం ఉంది. నేను ఫేమస్ కావడం కోసం సంభాల్ సర్కిల్ ఆఫ్సీర్ ని ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను. దాన్ని కోసం అతనికి చాలాసార్లు కాల్ చేశాను. ఒక్క వేల ఇంటర్వ్యూ జరిగి ఉంటె ఇండియా మొత్తం ఫేమస్ ఐయేవాడిని అని చెప్పాడు.