AP News: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనలో నకిలీ ఐపీఎస్ వ్యవహారం కలకలం రేపింది. ఐపీఎస్ అధికారి యూనిఫాంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చిన ఘటన సంచలనంగా మారింది. పవన్ కల్యాణ్ ఎక్కిడికి వెళ్లినా జనం సమూహం అధికంగా ఉండటంతో తొలుత ఎవరూ గుర్తించలేకపోయారు. ఆ తర్వాత గుర్తించిన పోలీసులు నిందితుడిని పట్టుకోవడంతో అసలు విషయం బయటకొచ్చింది.
AP News: పవన్‌కల్యాణ్ మన్యం పర్యటనలో నకిలీ ఐపీఎస్ అవతారం ఎత్తిన వ్యక్తి విజయనగరం జిల్లా ముదిగాంకు చెందిన సూర్యప్రకాశ్‌గా పోలీసులు గుర్తించారు. విజయనగరం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా అతడిని అదుపులోకి తీసుకొని విచారణించారు. ఈ సూర్యప్రకాశ్ గతంలో పార్వతీపురం డివిజన్‌లో తూనికలు కొలతలు శాఖ విభాగంలో పనిచేసినట్లు పోలీసులకు ప్రాథమికంగా తెలిసింది.
AP News: తాను గత ఏడాది ఐపీఎస్ అధికారి ఎంపికయ్యానని, శిక్షణలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పర్యటనకు తానొచ్చానని స్థానికులకు చెప్పుకున్నారని తెలిసింది. మరిన్ని విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉండగా, పవన్‌కల్యాణ్ మన్యం పర్యటనలో నకిలీ ఐపీఎస్ ఘటనపై విచారణకు రాష్ట్ర హోంశాఖా మంత్రి అనిత ఆదేశాలను జారీ చేశారు. సమగ్ర విచారణ చేపట్టి, ఇలాంటి ఘటనలు మళ్లీ చోటుచేసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు.