Crime News

Crime News: తండ్రీకూతురిని తుపాకితో కాల్చి చంపిన యువకుడు..

Crime News: బిహార్‌ రైల్వేస్టేషన్‌లో దారుణం జరిగింది. అప్పటిదాకా ప్రయాణికులతో కలకలలాడిన స్టేషన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తండ్రి, కూతురిని ఓ వ్యక్తి దారుణంగా హతమార్చగా పట్టపగలే రైల్వే ప్లాట్‌ఫామ్‌లో నెత్తురు ఏరులై పారింది. ఈ ఘటనతో రైల్వే సిబ్బంది, ప్యాసింజర్స్ పరుగులు పెట్టారు. ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాక అతాలకుతలమైన పోలీసులు.. కాసేపటికి అప్రమత్తమయ్యేలోపు రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

ఈ మేరకు తండ్రి అనిల్‌ సిన్హా, తన 16 ఏళ్ల కూతురు ఆరాతో కలిసి రైల్వే స్టేషన్ వచ్చారు. ఢిల్లీ వెళ్లేందుకు తాను వెళ్లాల్సిన ట్రైన్ కోసం 3,4 ప్లాట్‌ఫామ్‌ల మధ్య ఉన్న ఓవర్‌ బ్రిడ్జి ఎక్కి నడుస్తున్నారు. ఈ క్రమంలోనే కనురెప్పచాటున భోజ్‌పుర్‌కు చెందిన అమన్‌కుమార్‌ తుపాకితో వారిద్దరినీ కాల్చేశాడు. బుల్లెట్ దెబ్బలకు తండ్రీకూతుళ్లిద్దరూ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.

అయితే ఈ దారుణానికి పాల్పడ్డ యువకుడు సైతం అదే తుపాకితో అక్కడే కాల్చుకుని చనిపోయాడు. ఈ కాల్పులకు గల కారణాలు తెలియాల్సివుండగా కేసు నమోదు చేసుకుని ప్రేమ వ్యవహారం కోణంలో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *