Crime News: సిద్దిపేట జిల్లా ములుగు మండలంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. పెళ్లయి రెండు వారాలు కూడా కాకముందే ఓ యువతి గర్భవతిగా మారడంతో భర్త అనుమానం వ్యక్తం చేశాడు. చివరకు ఆ అనుమానం నిజమవుతూ, సినిమా కథను తలపించేలా సంచలన నిజాలు బయటపడ్డాయి.
వివరాల్లోకి వెళ్తే..
ములుగు ప్రాంతానికి చెందిన యువతికి ఇటీవల వివాహం జరిగింది. వివాహం జరిగి కేవలం 13 రోజులకే ఆమె గర్భం దాల్చినట్లు భర్త గమనించాడు. దీనిపై ఆగ్రహంతో భార్యను నిలదీయగా, ఆమె కన్నీరు మున్నీరుగా అసలు విషయం చెప్పింది.
పెళ్లికి ముందు ఆమెకు ఉదయ్ కిరణ్ అనే యువకుడితో ప్రేమ సంబంధం ఉన్నట్లు వెల్లడించింది. ప్రేమ పేరుతోనే అతను ఆమెను శారీరకంగా మోసం చేశాడని తెలిపింది. అంతే కాకుండా, ఈ విషయాన్ని మరో యువకుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడని కూడా భర్తకు చెప్పింది.
ఇది కూడా చదవండి: Crime News: మెదక్ జిల్లాలో దారుణం.. పని ఇప్పిస్తామని తీసుకెళ్లి గ్యాంగ్ రేప్.. మహిళ మృతి
ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పిన పరువు ఎక్కడ పోతుందో అని భయంతో తొందరగా కూతురికి పెళ్లి చేసేసారు.
ఈ వివరాలు బయటకు రావడంతో భర్త పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల దర్యాప్తులో విషయం నిజమని తేలడంతో, ఇద్దరు నిందితులపై పోక్సో చట్టం మరియు అత్యాచారం కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.
ఈ ఘటనతో ములుగు పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది. ప్రేమ పేరుతో మోసాలు, బెదిరింపులు పెరుగుతున్న నేపథ్యంలో, యువతులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
మొత్తం మీద, సినిమా కథను తలపించే ఈ దారుణ ఘటన, సమాజంలో నమ్మకాన్ని దెబ్బతీసే మరో ఉదాహరణగా మారింది.