Hyderabad: వచ్చారు ..పొడిచారు..పారిపోయారు. ప్రేమ కారణమే..ప్రాణాలు తీసింది అని చెబుతున్నా..పక్కాగా కారణం అయితే బయటకు రాలేదు. పోలీసులు వచ్చారు..పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్నారు. ఇంతకీ ఆ యువకుడిని చంపడానికి ప్రధాన కారణం ఏంటి ? ప్రేమే అసలు కారణమైనా ..చంపడం ఏంటి ? చంపుట…ప్రాబ్లెమ్ సాల్వ్ అవుతుందా ? తప్పు చేస్తున్నాడు అని ఫీలై చంపుట..చంపి నువ్వు కూడా పెద్ద తప్పే చేసావ్ కదా
యువకుడిపై కత్తులతో దాడిచేసి హత్యచేసిన ఘటన హైదరాబాద్ పాతబస్తీలో కలకలం రేపుతుంది. పాతబస్తీలోని సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓవైసీ కాలనీలో మోహీద్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. బర్హానా షా సాహబ్ దర్గా కమాన్ వద్ద నడుకుంటూ వెలుతున్న మోహిద్ పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా కత్తులతో దాడిచేశారు. మోహిద్ ను కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు.
ఇది కూడా చదవండి: Fake RTO: ఉప్పల్‌లో నకిలీ ఆర్టీవో అరెస్ట్
Hyderabad: దీంతో మోహీద్ అక్కడికక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచారు. మోహీద్ మృతి చెందిన అనంతరం దాడి చేసిన వారు అక్కడి నుంచి పరార్ అయ్యారు. స్థానిక సమచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మోహిద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. హత్యకు గల కారణాలు ప్రేమ వ్యవహారమే నని అనుమానం వ్యక్తం చేశారు.
మోహిద్ పై దాడికి ఇతర కారణాలు ఏమైనా వున్నాయా? అనే దానిపై ఇంకా తెలియాల్సి ఉంది. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసుకుని సంతోష్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.