Fake RTO: ఆపు ఆపు..బండి ఆపు. లైసెన్సు..ఇన్సూరెన్స్ ..పేపర్లు అన్ని చూపించు . సర్ …పేపర్లు లేవు. అవునా…అయితే కట్టు..పది వేలు. ఆమ్మో పది వేళా..లేవు సర్ . కుదరని కుదరదు. కట్టాల్సిందే. కడతావా…బండి సీజ్ చేయమంటావా. ఫైన్ కాదు కానీ. ఈ ఐదు వేలు ఉంచుకోండి సర్..కుదరదు కానీ..బండి పక్కన పెట్టండి. ఇలానే బెదిరిస్తారు. బెదిరిస్తే పర్లేదు. కానీ…ఒరిజినల్ అధికారై ఉండాలి కదా. నకిలీ గాళ్ళ డైలాగ్స్ ఇవి.
హైదరాబాద్‌లోని ఉప్పల్ ఏరియాలో నకిలీ ఆర్టీవో భాగోతం బయటపడింది.. ఉప్పల్ ప్రాంతంలోనే నివసించే ఓ వ్యక్తి మరో ఇద్దరు వ్యక్తులను కలుపుకొని నకిలీ ఆర్డిఏ అధికారులు అంటూ అవతారం ఎత్తారు. ఉప్పల్ ప్రాంతంలో కాంక్రీట్ వర్క్ కోసం ఇసుక ఇతర మెటీరియల్ సప్లై చేసే ట్రాక్టర్లను ఆపుతూ తనిఖీలు చేస్తున్నారు. వాహనాలకు లైసెన్సులు లేవని ఇన్సూరెన్స్ లేదని ఇలా సప్లై చేయడం చట్ట విరుద్దమని బెదిరిస్తూ.. వారి నుంచి అందిన కాడికి డబ్బులు దండుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: Hyderabad: మాదాపూర్‌లో విషాదం..సాప్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
Fake RTO: దాదాపు సంవత్సర కాలం నుంచి ఈ తంతు నడిపిస్తున్నట్లుగా బాధితులు తెలిపారు. నకిలీ ఆర్టీవో అధికారుల పేరుతో తనిఖీలు చేస్తున్న వీళ్లు..ప్రతిరోజూ 20 నుంచి 30 వేల వరకు వసూలు చేస్తున్నట్లుగా తెలిసింది. అయితే, ఆర్టీవో అధికారులు అని చెప్పుకుంటున్న వాళ్లు ప్రధాన రహదారుల వెంట ఉండకుండా చిన్న చిన్న కాలనీలు సైతం తనిఖీలు చేయడం, డబ్బులు వసూలు చేయడంతో బాధితులకు అనుమానం వచ్చింది.
దీంతో వారిపై నిఘా పెట్టిన ట్రాక్టర్ యజమానులు కాంక్రీట్ నిర్వహికులు సదురు వ్యక్తులు నిజమైన ఆర్టీవో అధికారులు కాదని, ఫేక్ అధికారులని తెలుసుకున్నారు. ఈ ఘటనపై ఉప్పల్ పోలీసులను ఆశ్రయించి కంప్లైంట్ చేయడంతో ఫేక్ అధికారుల ఇంటికి వెళ్లి పట్టుకునే ప్రయత్నం చేశారు.. పోలీసులు వస్తున్న విషయాన్ని పసిగట్టిన ఫేక్ ఆర్డిఏ అధికారి తప్పించుకోగా, అతని వద్ద సిబ్బందిగా పనిచేస్తున్న మరో వ్యక్తిని, వాళ్లు వాడుతున్న కారును పట్టుకున్నారు. పోలీసులు విచారణ చేసి అస్సలు నిందితులను పట్టుకుని న్యాయం చేయాలని బాధితులు కోరారు.