Droupadi murmu: హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము. స్వగతం పలికిన సీఎం రేవంత్ తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ.నేడు, రేపు హైదరాబాద్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా హైదరాబాద్‌లోని కొని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈరోజు సా.5:30 నుంచి రాత్రి 9 వరకు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు వున్నాయి. పంజాగుట్ట, గ్రైన్ ల్యాండ్స్ జంక్షన్ వైపు వచ్చే వాహనాలకు ట్రాఫిక్ మళ్లింపు చేయనున్నారు. రేపు ఉ.9:30 నుంచి మ.12:15 గంటల వరకు ఈ ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు వుండనున్నాయి. రాజ్‌భవన్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు తప్పవు.